కలం, వెబ్ డెస్క్ : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ నుంచి పోస్టర్ (Swayambhu Poster) రిలీజ్ అయింది. నిఖిల్ రథానికి చెందిన చక్రాన్ని పైకి లేపుతున్నట్లు కనిపిస్తున్న ఈ స్టిల్ అడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా విడుదలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాని నిజానికి గత ఏడాదే విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2026 అని చెప్పారు. కొన్నాళ్ళకు ఏప్రిల్ 10 అని అన్నారు. తర్వాత నిరవధికంగా వాయిదా వేస్తున్నారు.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో సంయుక్త, నభా నటేశ్ లు హీరోయిన్లు. ఇటీవల ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నిఖిల్ ఒక యోధుడిగా కనిపిస్తాడు. ఈ సినిమా విజయం అతనికి కీలకం. మరి ఈ సినిమా రిలీజ్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో?.. ఈ మూవీ నిఖిల్ సినీ కెరీర్ కు ప్లస్ అవుతుందో? లేదో? వేచి చూడాలి.
Read Also: బెంగళూరులో వీఐపీ మూమెంట్ కలకలం.. వ్యక్తి నిరసన వైరల్
Follow Us On : WhatsApp

