తెలంగాణ‌లో మోదీ, అమిత్ షా పర్య‌ట‌న‌లు ఖ‌రారు!

క‌లం, వెబ్‌డెస్క్: సుదీర్ఘ కాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణ ప‌ర్యట‌న దాదాపు ఖారారైంది. రానున్న న‌వంబ‌ర్‌లో అమిత్ షా తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. అలాగే ప్ర‌ధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తెలంగాణ టూర్‌కు కూడా ముహూర్తం కుదిరింది. డిసెంబ‌ర్‌లో మోదీ రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో బీజేపీ బ‌లోపేత‌మే ల‌క్ష్యంగా అమిత్ షా ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది.

అమిత్ షా న‌వంబ‌ర్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ బూత్‌ కమిటీ సమ్మేళనాల్లో పాల్గొన‌నున్నారు. కార్య‌క‌ర్త‌ల‌కు, స్థానిక నాయ‌కుల‌కు ఎన్నిక‌లు, పార్టీ బ‌లోపేతంపై దిశా నిర్దేశం చేయ‌నున్నారు. మ‌రోవైపు డిసెంబ‌ర్‌లో వ‌రంగ‌ల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసేందుకు ప్ర‌ధాని మోదీ తెలంగాణ‌కు రానున్నారు. ఈ సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. అగ్ర‌నేత‌ల ప‌ర్య‌ట‌న‌లు ఖ‌రారు కావ‌డంతో బీజేపీ నాయ‌కుల్లో కొత్త ఉత్సాహం నెల‌కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>