రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా సెటైర్లు

కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 30 సంవత్సరాలైనా అధికారంలోకి రాదని ఆయన జోస్యం చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

“వీరు విదేశాల్లో ఉన్నందునా.. నా మాటలు వినలేరు.. మీరెక్కడో విదేశాల్లో ఉన్నారు. ఎందుకెళ్లారో చెప్పకపోయినా ఫర్వాలేదు. అది మీ వ్యక్తిగతం.. కానీ, తిరిగి వచ్చిన తరువాత నా మాటలు వినండి. మరో 30ఏళ్లయినా మీరు పవర్ లోకి రాలేరు” అని రాహుల్ గాంధీని ఉద్దేశించి అమిత్ షా సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీలా తాను విదేశాలు వెళ్లే వ్యక్తిని కాదని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ ఓటములను సాకుగా చూపించి ఓటు చోరీ అంశాన్ని వాడుకుంటోందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుండడంతో ప్రతిపక్షాలకు ఆందోళన కలుగుతోందన్నారు. అందుకు ఓటు చోరీ పేరుతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. చొరబాటుదారులను కాపాడేందుకే రాహుల్ గాంధీ ఈ అంశాన్ని వాడుకుంటున్నారని షా ఆరోపించారు.

నరేంద్ర మోదీ ప్రధాని కాకముందే బీజేపీ పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని షా (Amit Shah) గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ మాత్రం దశాబ్దాలుగా అనేక రాష్ట్రాలలో ఓటమి పాలవుతోందని హోంశాఖ మంత్రి విమర్శించారు.

Also Read : భారీ ఆందోళనకు ఇండియా కూటమి రెడీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>