కలం, వెబ్ డెస్క్: దేశంలో కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టి.. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు (Ramchander Rao) పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో త్వరలో చేపట్టనున్న ‘లోక్ తంత్ర బచావో – భీడ్‌తంత్ర హటావో’ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశానికి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం ప్రజల మనసులను, విశ్వాసాన్ని గెలుచుకోవడంలో విఫలమైందన్నారు. అధికార మార్పే లక్ష్యంగా అరాచకాలను ప్రోత్సహిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కంటే నెహ్రూ–గాంధీ కుటుంబం పట్ల గుడ్డి విధేయత ఉందని ఎద్దేవా చేశారు.ఇలాంటి అరాచకాలను చూసి భారతదేశం ఇకపై మౌనంగా ఉండదన్నారు.
కాంగ్రెస్ కుట్రలను ప్రజల ముందు ఎండగట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమాన్ని చేపట్టనున్నామని రాంచందర్ రావు (Ramchander Rao) తెలిపారు. దీనికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : తెలంగాణలో మోదీ, అమిత్ షా పర్యటనలు ఖరారు!
Follow Us On: Youtube

