కొండారెడ్డిపల్లి చెరువులో తగ్గిన నీటిమట్టం.. గణనాథుల నిమజ్జనంపై సందిగ్ధం

కలం, నారాయణపేట : నారాయణపేట (Narayanpet) అంటేనే వినాయక చవితి ఉత్సవాలకు ఎంతో పేరు ప్రఖ్యాతి గాంచింది. ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం టౌన్ శివారులో ఉన్న కొండారెడ్డిపల్లి చెరువులో (Kondareddipalli cheruvu) చేసేవారు. కానీ ఈ సంవత్సరం చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండడంతో భారీ వినాయకులను నిమజ్జనం చేసేందుకు వీలుగా చెరువులో నీరు లేదు. ఇదే అంశంపై మున్సిపల్ కమిషనర్ తో పాటు చైర్మన్, వైస్ చైర్మన్, పలువురు కౌన్సిలర్ల బృందం బుధవారం చెరువును సందర్శించారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి

క్రేన్ సహాయంతో కూడా వినాయకులను నిమజ్జనం చేసేందుకు వీలు లేకపోవడంతో ఏ మేరకు చర్యలు తీసుకోవాలని అంశంపై పరిశీలన చేశారు. గతంలో చెరువులో నీటిమట్టం లేని సమయంలో సత్యనారాయణ చౌరస్తా వద్ద లారీలను ఏర్పాటు చేసి భారీ వినాయకులను కృష్ణా నదికి తరలించారు. మరి ఈ సంవత్సరం ఏ మేరకు చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>