గావిట్ టార్గెట్.. రెండు గోల్డ్‌లు!

కలం, స్పోర్ట్స్ :  కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టిన భారత పారా అథ్లెట్ దిలీప్ మహాదూ గావిట్ (Dilip Mahadu Gavit) ఇప్పుడు మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. రాబోయే ఆసియా పారా గేమ్స్‌లో (Asian Para Games 2026) రెండు స్వర్ణాలు సాధించడమే తన లక్ష్యమని గావిట్ ప్రకటించాడు. 100 మీటర్లు, 400 మీటర్ల ఈవెంట్లలో బరిలోకి దిగి.. రెండింటిలోనూ పసిడి పతకాలు సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. ఇటీవల జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో 100 మీటర్ల టీ47 విభాగంలో గావిట్ స్వర్ణ పతకం సాధించాడు. కేవలం 10.71 సెకన్లలో రేసును పూర్తి చేసి గేమ్స్ రికార్డును నెలకొల్పాడు. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత పురుష పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.

కామన్వెల్త్ గేమ్స్‌లో 400 మీటర్ల ఈవెంట్ లేకపోవడంతో గావిట్ పూర్తిగా 100 మీటర్లపైనే దృష్టి సారించాడు. అయితే ఆసియా పారా గేమ్స్‌లో 400 మీటర్ల ఈవెంట్ కూడా ఉండటంతో ఈసారి రెండు విభాగాల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. గావిట్‌(Dilip Mahadu Gavit)ను 100, 400 మీటర్ల ఈవెంట్లకు కోచ్ వైజ్‌నాథ్ కాలే ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. రెండు రేసుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యంగా శిక్షణ కొనసాగిస్తున్నాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో.. ఆసియా పారా గేమ్స్‌లోనూ భారత పతాకాన్ని ఎగరేయాలని గావిట్ ఉవ్విళ్లూరుతున్నాడు.

Also Read : అల్కరాజ్‌కు బిగ్ షాక్.. షెల్టన్ సంచలన విజయం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>