బుమ్రా వికెట్‌లెస్ షో‌పై పెదవి విప్పిన ముంబై ఇండియన్స్

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ప్రదర్శనపై వస్తున్న విమర్శలపై ముంబై ఇండియన్స్ (Mumbai Indians) యాజమాన్యం స్పందించింది. ప్రపంచ నంబర్ వన్ బౌలర్ అయిన బుమ్రా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే బుమ్రా ఫామ్‌పై నోరు విప్పారు. బుమ్రా వికెట్లు తీయలేకపోవడానికి ఆయన వైఫల్యం కారణం కాదని జయవర్ధనే స్పష్టం చేశారు. పవర్‌ప్లేలో ఇతర బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమవుతున్నారని, అందుకే బుమ్రాకు వికెట్లు దక్కడం లేదని ఆయన విశ్లేషించారు. దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ వంటి మేటి బౌలర్లు ఉన్నప్పటికీ ఆరంభంలో బ్రేక్ త్రూలు రాకపోవడం వల్ల, బ్యాటర్లు బుమ్రా బౌలింగ్‌లో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఆడుతున్నారని జయవర్ధనే వెల్లడించారు.

జట్టులోని ఇతర బౌలర్లు కూడా బాధ్యత పంచుకోవాలని జయవర్ధనే సూచించారు. క్యాంప్‌లో ఆటగాళ్ల గాయాలు, అనారోగ్య సమస్యల వల్ల సరైన బౌలింగ్ యూనిట్‌ను బరిలోకి దింపలేకపోయామని ఆయన వివరించారు. అయినప్పటికీ బుమ్రాపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఒక్కసారి ఆయన వికెట్ల ఖాతా తెరిస్తే ఆ తర్వాత ఆపడం ఎవరికీ సాధ్యం కాదని జయవర్ధనే ధీమా వ్యక్తం చేశారు. ముంబై ఇండియన్స్ వరుస ఓటములకు కేవలం బుమ్రానే బాధ్యుడిని చేయడం సరికాదని, ఒక బౌలింగ్ యూనిట్‌గా తాము మెరుగుపడాల్సిన అవసరం ఉందని కోచ్ అభిప్రాయపడ్డారు.

Read Also:  మహిళా బిల్లుపై మోడీ భావోద్వేగ అప్పీల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>