పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి: ముధోల్ ఎమ్మెల్యే

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ‘పల్స్ పోలియో’ (Pulse Polio) కార్యక్రమాన్ని ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలియో వ్యాధి నుంచి చిన్నారులను రక్షించడంలో పల్స్ పోలియో చుక్కలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోళ్ళ దత్తాద్రి, వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>