కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మళ్లీ మెరుపులు మెరిపించేందుకు రెడీ అవుతున్నాడు. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైనప్పటికీ, ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ మునుపటి జోరును ప్రదర్శిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ధోనీ నెట్స్‌లో చెమటలు కక్కుతూ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తనదైన శైలిలో భారీ షాట్లతో విరుచుకుపడుతూ ఫిట్‌నెస్ విషయంలో తనకు సాటిలెవరూ లేరని నిరూపిస్తున్నాడు. వయసు పెరిగినా, గాయాలు వేధించినా తన పవర్ ఏమాత్రం తగ్గలేదని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ధోనీ వింటేజ్ లుక్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న తీరు చూస్తుంటే, ఈ సీజన్‌లో కూడా అభిమానులకు సిక్సర్ల విందు ఖాయమనిపిస్తోంది. మాహీ పట్టుదలను చూసి సామాజిక మాధ్యమాల్లో ‘తగ్గేదే లే’ అంటూ ఫ్యాన్స్ వరుసగా కామెంట్లు చేస్తున్నారు.

