కుర్వపల్లి బ‌డిలో టీచ‌ర్ల‌ కొర‌త‌.. క‌లెక్ట‌రేట్‌కు స్టూడెంట్స్‌!

కలం, జోగులాంబ‌ గద్వాల: గద్వాల మండలంలోని కుర్వ‌పల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో (Kurvapally School) ఉపాధ్యాయుల కొరత విద్యార్థుల చదువులకు ఆటంకంగా మారింది. గతంలో 150 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 8వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో ఇద్దరే ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారు. దీంతో విద్యార్థులు బడులు మానేసి పొలం బాట పడుతున్నారు. విద్యార్థుల సంఖ్య 150 మంది నుంచి 80 మందికి త‌గ్గిపోయింది.

పాఠశాలలో నెలకొన్న సమస్యను పలుమార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదు. దీంతో సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పిల్లల ప్రజావాణిలో విద్యార్థులు, తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితిని వివరించి అదనపు ఉపాధ్యాయులను నియమించాలని వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>