కలం, స్పోర్ట్స్ : టీమిండియా వేగవంతమైన బౌలర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) దాదాపు ఏడాదినరగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. 36 ఏళ్ల షమీని వయసు పెరిగిన కారణంగానే సెలెక్టర్లు పక్కన పెడుతున్నారనే ప్రచారం నడుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ యంగ్ బౌలర్లకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ వార్తలు ఎక్కువయ్యాయి. అయితే, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ లాగా అనుభవం ఉన్న షమీని ఎందుకు దూరంగా పెడుతున్నారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఈ అంశంపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా స్పందించారు. షమీ విషయంలో వయసు అసలు కారణమే కాదని ఆయన తెలిపారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు షమీ కంటే పెద్దవారైనా ఇప్పటికీ ఎంపికవుతున్నారని ఆయన గుర్తుచేశారు. కాబట్టి వయసును బట్టి పక్కన పెడుతున్నారనడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు. మిచెల్ స్టార్క్ ఎప్పుడూ ఫిట్‌గా ఉంటూ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడని చోప్రా వివరించారు.
కానీ షమీ శస్త్రచికిత్స చేయించుకుని సుదీర్ఘకాలం ఆట నుంచి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. దేశవాళీ క్రికెట్లోకి తిరిగొచ్చిన తర్వాత షమీ వికెట్లు తీసినప్పటికీ, అతని బౌలింగ్‌లో పాత వేగం, తీవ్రత తగ్గయనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. తాజాగా ఈస్ట్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ ఆడిన షమీ, తన కెరీర్లో 100 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నారు. అతన్ని ఎంపిక చేయకపోవడానికి గల అసలు కారణాలను బోర్డు స్పష్టం చేయాల్సి ఉందని, అయితే ప్రధానంగా ఫిట్నెస్ సమస్యలే అందుకు కారణం కావచ్చని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు.

