కలం, జోగులాంబ గద్వాల: వ్యవసాయానికి కరెంట్ సరఫరాలో తీవ్ర కోతలు విధిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం కేటి దొడ్డి మండలం ఇర్కిచేడు (Irkichedu)లోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. కరెంట్ కోతల గురించి సబ్ స్టేషన్ సిబ్బందిని ప్రశ్నించగా.. తమకు తెలియదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ శాఖ అధికారులను సంపద్రిచాలని సూచించడంపై రైతులు మండిపడ్డారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, కనీసం ఆరు గంటలు కూడా ఇవ్వలేకపోతోందన్నారు. ఇష్టారీతిన సరఫరా చేస్తుండటంతో లో-వోల్టేజీ కారణంగా మోటార్లు సరిగ్గా నడకవ పొలాలకు నీరు అందడం లేదన్నారు. మరోవైపు మోటార్లు కాలిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

