కలం, నిర్మల్: భైంసా మండలం కోతుల్ గామ్ గ్రామస్తులు గురువారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Rama Rao Patel)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని బీరప్ప ఆలయ (Beerappa Temple) అభివృద్ధి కోసం మంజూరైన రూ.10 లక్షల నిధులకు సంబంధించిన మంజూరు పత్రాన్ని గ్రామ సర్పంచ్ భూమేశ్‌కు ఎమ్మెల్యే అందజేశారు. గ్రామాల అభివృద్ధితో పాటు దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. నిధుల మంజూరు పత్రం అందజేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

