కలం, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ సంకల్పంతో నిర్వహిస్తున్న 15 రోజుల విశ్వశాంతి మహాయాగం భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. యాగశాలలో వేదఘోషలు, మంత్రోచ్ఛారణలు, హోమాగ్ని పరిమళాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆదివారం ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామీజీ ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విశ్వశాంతి యాగంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంటుందన్నారు. ఆధునిక జీవన విధానంలో కనుమరుగవుతున్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు పరిచయం చేసేందుకు ఇటువంటి మహాయాగాలు దోహదపడతాయని పేర్కొన్నారు. భక్తి, ధర్మం, సనాతన సంప్రదాయాల పరిరక్షణకు ఈ మహాయాగం చక్కని వేదికగా నిలుస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, కౌన్సిలర్ విభూది మహేశ్వరి, విజయలక్ష్మి పరుశురాం, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు రమేష్ చంద్ర, బి.కృష్ణ, పాల రవి, గొల్ల రవి, విభూతి నారాయణ, పెబ్బేరు మండలాధ్యక్షుడు యాపర్ల రామిరెడ్డి, మాజీ జడ్పీటీసీలు గొల్ల వెంకటయ్య, రమేష్ గౌడ్ పాల్గొన్నారు.

