భైంసాలో పెండింగ్ బిల్లుల వివాదం.. కాంట్రాక్టర్ల ఆందోళన

కలం, బైంసా: భైంసా(Bhainsa) మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వివిధ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు(Relay Hunger Strike) ఆదివారం మహారాణా ప్రతాప్ యూత్ సభ్యులు సంఘీభావం తెలిపారు. గతేడాది వివిధ పండగల సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో టెండర్ల ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను అధికారులు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించిన తర్వాతే ఈ ఏడాది పండగల పనులకు టెండర్లు నిర్వహించాలని కోరారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుపై అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>