ఇందూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే ధన్‌పాల్ కీలక వ్యాఖ్యలు

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫండ్ ఇవ్వాలని, ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana Gupta) తెలిపారు. నిజాంబాబాద్ నగరంలోని 26వ డివిజన్‌లో చేపట్టే రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఏడాది కార్పొరేషన్‌లో పాలక వర్గం లేకపోవడం, కౌన్సిల్ సమావేశం జరగకపోవడంతో నిధులు లేవన్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్ కు రూ. 20 లక్షలు కేటాయించారన్నారు. వీటితో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రతి డివిజన్‌కు కోటి రూపాయల పనులు కూడా ప్రారంభమవుతున్నాయని తెలిపారు. అర్బన్ చాలెంజ్ ఫండ్, ఖిల్లా రామాలయంలో రోప్ వేకు డీపీఆర్ కూడా సిద్ధమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, స్థానిక కార్పొరేటర్ బంటు రాము, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>