ఎమ్మెల్యే అనిల్ ఆధ్వ‌ర్యంలో మహా పడిపూజ

కలం, నేరడిగొండ: నేరడిగొండ మండల కేంద్రంలోని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) నివాసంలో శనివారం అయ్యప్ప మహా పడిపూజ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఉదయం గణపతి హోమంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం అయ్యప్ప స్వాములు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అయ్యప్ప మాల ధరించిన ఎమ్మెల్యే తనయుడు అర్జున్ జాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే రాత్రి మహా పడిపూజలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృత అభిషేకాలు నిర్వహించి, వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. గురుస్వాములు కౌట ప్రభాకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి తదితర స్వాములు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>