ఇరిగేషన్ రంగాన్ని నాశనం చేశారు.. కేసీఆర్​పై ఉత్తమ్ ఫైర్​​

కలం, వెబ్​ డెస్క్​: బీఆర్​ఎస్​ నాయకులు కన్నెపల్లి పంప్​ హౌస్ (Kannepalli Pump House)​ ను సందర్శించడంపై మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి (Uttam Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజీల నిర్మాణాల విషయంలో వాళ్ల తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కన్నెపల్లి పర్యటన చేపట్టారని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఇరిగేషన్ రంగాన్ని కేసీఆర్ అండ్ కంపెనీ సర్వనాశనం చేసిందని ఉత్తమ్​ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదైనప్పటికీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యతా లోపాల కారణంగానే బ్యారేజీల నిర్మాణాలు దెబ్బతిన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘మేమే కట్టాము.. మేమే కూల్చామని చెప్పడానికే బీఆర్ఎస్ నేతలు పర్యటన చేపట్టారు’ అని మంత్రి (Uttam Kumar Reddy) ఎద్దేవా చేశారు. అక్టోబర్ నెలలో ఒక్క రోజు కూడా వర్షం పడలేదన్నారు.

కాగా, సాగునీటి సమస్యలను తీర్చాలని బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించారు. ఇప్పటికైనా కన్నెపల్లి మోటర్లు ఆన్ చేసి గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి సమస్యతో పాటు రైతుల సాగునీటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. పంప్ హౌస్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బైఠాయించి నిరసన తెలిపారు.

Also Read : 11 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్.. బోధన చరిత్ర!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>