రేపు ముంబైకి సీఎం రేవంత్.. ఎందుకంటే?

క‌లం, వెబ్‌డెస్క్‌: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం సాయంత్రం ముంబైకి వెళ్ల‌నున్నారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి అవ‌స‌రాల‌ను తీర్చ‌డంతో కీలకంగా ఉన్న తుమ్మిడిహ‌ట్టి బ్యారేజ్‌ (Tummidihatti Barrage)పై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చించేందుకు ఆయ‌న త‌న బృందంతో బ‌య‌లుదేర‌నున్నారు. ఈ మేర‌కు సోమ‌వారం సీఎం రేవంత్‌, మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్‌తో భేటీ కానున్నారు. తుమ్మిడిహ‌ట్టి బ్యారేజ్ ఎత్తును 152 మీటర్లకు పెంచితే నీటి మళ్లింపు ఎలా సాధ్యమవుతుందనే దానిపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇప్ప‌టికే సీఎం అధికారుల‌ను ఆదేశించారు. అలాగే పొరుగు రాష్ట్ర అభ్యంతరాలను పరిష్కరిస్తూనే ప్రయోజనం పొందేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన నీటి అవసరాలపై కూడా సీఎం (CM Revanth) ఉన్న‌తాధికారుల‌తో చర్చించారు. శ్రీశైలం జలాశయం నుంచి నిర్దేశిత మేర నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. బ్యారేజ్ ఎత్తు, ముంపు ప్రాంతాలపై సాంకేతిక నివేదికలను సిద్ధం చేసి, త్వరలో జరిగే చర్చల్లో మహారాష్ట్రను ఒప్పించే దిశగా పకడ్బందీగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

Also Read : సొంత జిల్లాలోనే సీఎంకు అసలు పరీక్ష!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>