కేంబ్రిడ్జ్‌లో మొదలైన ప్రేమకథ.. రాజీవ్‌తో తొలి పరిచయాన్ని గుర్తుచేసుకున్న సోనియా గాంధీ

కలం, నేషనల్ డెస్క్ : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ(Rajiv Gandhi)తో తనకు ఏర్పడిన తొలి పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారిన అనుబంధాన్ని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ (Sonia Gandhi) మరోసారి గుర్తుచేసుకున్నారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో (Cambridge) 1965లో ఓ చిన్న గ్రీకు రెస్టారెంట్‌లో తమ ప్రేమకథకు పునాది పడిందని వెల్లడించారు. తన జీవిత విశేషాలతో రూపొందించిన ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. ఈ పుస్తకం నవంబర్‌ 10న పాఠకుల ముందుకు రానుంది.

తన సామాజిక మాధ్యమ ఖాతా ఎక్స్‌లో తొలిసారిగా వీడియోను విడుదల చేసిన సోనియా.. రాజీవ్‌తో (Rajiv Gandhi) గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఇంగ్లండ్‌లో మంచి ఆహారం లభించే రెస్టారెంట్లు తక్కువగా ఉండేవని, భారతీయ, ఇటాలియన్‌ విద్యార్థులు తరచూ వెళ్లే ఓ గ్రీకు రెస్టారెంట్‌ గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. అదే చోట ఓ స్నేహితుడి ద్వారా రాజీవ్‌ గాంధీతో పరిచయం ఏర్పడిందని వివరించారు.

రాజీవ్‌ అందంగా ఉండటమే కాకుండా, ఎంతో సున్నితమైన, సౌమ్యమైన వ్యక్తిత్వం కలిగి ఉండేవారని సోనియా పేర్కొన్నారు. తొలి పరిచయంలోనే ఆయన స్వభావం తనను ఆకట్టుకుందని, ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులుగా మారి కలిసి పార్టీలకు వెళ్లేవారమని చెప్పారు. పరిచయమైన కొద్దికాలానికే ఆయనతో కలిసి జీవించాలనే భావన తనలో కలిగిందని, రాజీవ్‌కు కూడా అలాంటి అభిప్రాయమే ఉండేదని తర్వాత తెలిసిందన్నారు.

ఈ పుస్తకంలో ఇటలీలో గడిపిన బాల్యం నుంచి రాజీవ్‌తో పరిచయం, ప్రేమ, వివాహం వరకు తన జీవిత ప్రయాణాన్ని సోనియా వివరించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీల హత్యలతో పాటు తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తిగత విషాదాలనూ ప్రస్తావించారు. భారత రాజకీయాల్లో తన పాత్ర, బాధ్యతలు, నష్టాలు, జీవితంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవడం వంటి అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి.

మొత్తం 544 పేజీలతో రూపొందిన ఈ పుస్తకాన్ని అంతర్జాతీయంగా ఆల్ఫ్రెడ్‌ ఏ. నాఫ్‌, భారత్‌లో హార్పర్‌కాలిన్స్‌ ప్రచురణ సంస్థలు విడుదల చేయనున్నాయి. పుస్తక తొలి ప్రతులను అందుకున్న సోనియా(Sonia Gandhi), తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి మిఠాయిలు పంచుకున్న వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. పుస్తకానికి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

Also Read : 11 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్.. బోధన చరిత్ర!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>