కలం, వెబ్‌డెస్క్: లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill) వీగిపోవడం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మంత్రి కృష్ణారావు (Minister Krishna Rao) అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టి వక్రమార్గంలో డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించుకోవాలని కుట్రపన్నింది. కానీ ఈ కుతంత్రాన్ని ఇండియా కూటమి ఏకతాటిపై నిలిచి ఎదుర్కొందని సంతోషం వ్యక్యం చేశారు. జనాభా నియంత్రణ పాటించడంతోపాటు కేంద్రానికి అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్న దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా ఈ బిల్లు రూపొందించారు. ఈ బిల్లుకు బ్రేక్ పడడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుందని అన్నారు.
లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య శక్తులు, ప్రతిపక్ష నాయకులు అంతా ఏకమై ఒక జాతీయ విపత్తును నివారించారని అన్నారు. నల్ల బిల్లులను ఓడించేందుకు కఠిన పరిస్థితుల్లోనూ ఐకమత్యంతో, సాహసంతో నిలిచిన మిత్రపక్షాల నాయకులు ఎం. కె. స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, లాలు ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, ఫరూఖ్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, అలాగే కమ్యూనిస్ట్ పార్టీల నాయకులందరికీ మంత్రి (Minister Krishna Rao) హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: ముంబై ఓటములపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: Sharechat

