రైతులకు ఇబ్బందులు లేకుండ ధ్యానం కొనుగోలు: మంత్రి లక్ష్మణ్ కుమార్

కలం, బుగ్గారం : రైతులకు మద్దతు ధర చెల్లించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) పిలుపునిచ్చారు. శనివారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినది మంత్రి తెలిపారు.

రైతులకు కావాల్సిన గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు అనంతరం మిల్లర్ల నుండి వచ్చే సమస్యలను ధాన్యం కొనుగోలు సెంటర్ ఇన్ చార్జీ పరిష్కరించాలని మంత్రి సూచించారు. రైతులను ఎక్కడ ఇబ్బంది పెట్టవద్దని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. తేమ వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు ప్రారంభించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త హైమద్ ఇటీవల ఆనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ శనివారం పరామర్శించి ప్రాగాడ సానుభూతి వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>