Mobile Popup Ad
Mobile Popup Ad

పెద్ది భారీ విజయం.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

కలం, వెబ్ డెస్క్: రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబోలో బుచ్చిబాబు దర్శకుడిగా ఈ రోజు విడుదలైన ‘పెద్ది’ (Peddi) మూవీకి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘నేను షూటింగ్ కోసం పొల్లాచిలో ఉన్నా.. నా మనసు “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను.ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. పెద్ది పాత్రలో పూర్తిగా లీనం కావడానికి రామ్ చరణ్ అహర్నిశలుగా చేసిన కృషి, పట్టుదల, నిజాయతీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం’ అన్నారు.

వాళ్లందరి కారణంగానే భారీ విజయం..

పెద్ది విజయంలో అనేక మంది పాత్ర ఉందని మెగాస్టార్ చిరంజీవి వివరించారు. ‘ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబుకి నా ప్రత్యేక అభినందనలు. తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత సతీశ్ కిలారుకి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శివరాజ్ కుమార్, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన సోదర సమానుడు జగపతి బాబుకు అభినందనలు. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన ఏ.ఆర్.రెహమాన్, తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూలి, హీరోయిన్ జాన్వీ కపూర్‌కు శుభాకాంక్షలు. “పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని చిరంజీవి పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>