కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత కలహాలను సరిదిద్దేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా మంగళవారం గాంధీ భవన్లో పలువురు నాయకులతో ఆమె ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్ నాయకులు కొండా సురేఖ (Konda Surekha), కడియం శ్రీహరి వ్యవహారం రోజు రోజుకూ ముదురుతున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కొండా సురేఖ మీనాక్షి నటరాజన్‌కు కడియం శ్రీహరి (Kadiyam Srihari)పై ఫిర్యాదు చేశారు. నాలుగు పేజీల లేఖను ఆమెకు అందజేశారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై మీనాక్షి కడియం కావ్యతో కూడా చర్చించారు. అయితే చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని ఆమె కొండా సురేఖకు సూచించారు. పార్టీ నేతలు సంయమనం పాటించాలని కోరారు. వీరితో పాటు పలు జిల్లాల్లో నెలకొన్న సమస్యలపై మీనాక్షి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తుంగతుర్తి అంశంపై ఎంపీ చామల కిరణ్ కుమార్‌తో చర్చించారు. బుధవారం నుంచి డీసీసీ వరుస భేటీలతో పాటు మంత్రులతో విడివిడిగా సమావేశం కానున్నారు.

