కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) పరిధిలో మరో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. పటాన్‌చెరు (Patancheru) లోని ఒక డెకరేషన్ సామాగ్రి గోదాంలో శనివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ఉధృతంగా వ్యాపించడంతో, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

