కలం, వెబ్ డెస్క్: కర్ణాటక నూతన సీఎంగా డీకే.శివకుమార్ (DK Shivakumar) జూన్ 3వ తేదీన సాయంత్రం 5.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. రాజధాని బెంగళూరులో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను సాధారణ పరిపాలన శాఖ మొదలు పెట్టింది. సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే.శివకుమార్ రాష్ట్ర పాలనా బాధ్యతలు చేపట్టబోతున్న విషయం తెలిసిందే. సాయంత్రం పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగబోతుంది. డీకే.శివకుమార్‌ను ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకుంటారు.
జ్యోతిష్యుడి ప్రకారమే రోజు, సమయం ఫిక్స్..
డీకే.శివకుమార్‌కు (DK Shivakumar) ఆధ్యాత్మిక భక్తి చాలా ఎక్కువ. జ్యోతిష్యాన్ని చాలా బలంగా నమ్ముతుంటారు. ఆయనకు రాజగురు ద్వారకనాథ్ గురూజీ వ్యక్తిగత జ్యోతిష్య సలహాదారుడిగా కూడా చాన్నాళ్లుగా వ్యవహరిస్తున్నారు. డీకే రాజకీయంగా ఏ పని చేయాలన్నా.. ఆయన సలహా ప్రకారమే ముందుకు వెళ్తుంటారని పార్టీ నేతలు తరచూ చెబుతుంటారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఈ అంశం గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని ద్వారకనాథ్ గురూజీ ఆదేశించడంతోనే.. డీకే అలాగే చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రమాణ స్వీకారం రోజు, సమయం కూడా ఆయన సూచనలతోనే ఫిక్స్ చేయడం గమనార్హం.
Read Also: పటాన్‌చెరులో అగ్నిప్రమాదం.. డెకరేషన్ సామాగ్రి గోదాంలో చెలరేగిన మంటలు
Follow Us On : WhatsApp

