నల్గొండ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒకే ఇంట్లో నాలుగు సిలిండర్లు బ్లాస్టర్

కలం, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హాలియా సాయిప్రతాప్ నగర్ లో ఒకే ఇంట్లో నాలుగు సిలిండిర్లు (Nalgonda Cylinders Blast) పేలిపోయాయి. ఈ పేలుడు దాటికి ఇల్లు పూర్తి దగ్ధం అయింది. భారీగా మంటలు ఎగసిపడడంతో పాటు దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గంట పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భారీ శబ్ధం రాగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: హుస్నాబాద్‌కు తెలంగాణ ఉత్తమ పర్యావరణ పురస్కారం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>