Mobile Popup Ad
Mobile Popup Ad

మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు

కలం, వెబ్‌డెస్క్: ఇళ్లలో అందం కోసం, పాజిటివ్ ఎనర్జీ కోసం పెంచుకునే మొక్కలలో ‘మనీ ప్లాంట్’ (Money Plant) మొదటి స్థానంలో ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే సంపద, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తాయని చాలామంది నమ్ముతారు. అందుకే దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మొక్క కనిపిస్తూనే ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను సరైన దిశలో, సరైన విధంగా పెంచితేనే సానుకూల ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మనీ ప్లాంట్ ఏ దిశలో పెట్టాలి

మనీ ప్లాంట్ ను పెంచడానికి ఆగ్నేయం (వంటగది మూల), వాయువ్యం అనే రెండు దిక్కులు మాత్రమే అనుకూలమైనవని చెబుతున్నారు నిపుణులు. ఈశాన్యం, నైరుతి లేదా ఇతర ఏ దిశలో పెంచినా ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. తప్పుడు దిక్కులలో పెంచడం వల్ల కుటుంబంలో గొడవలు, ఆర్థిక నష్టాలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

మనీ ప్లాంట్ పెంచేటపుడు పాటించాల్సిన నియమాలు

మనీ ప్లాంట్ ను పెంచే విధానంలో కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. దీనిని ఎల్లప్పుడూ ఎర్రటి రంగు కుండీలో లేదా ఎర్రటి సీసాలో (నీటిలో పెంచినట్లయితే) పెట్టాలి. ఎర్రటి రంగు పాత్ర దాని శక్తిని మరింత పెంచుతుందని నమ్ముతారు. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, మనీ ప్లాంట్ కాండం ఎల్లప్పుడూ పైకి ఎదగాలి. దానిని ఆధారంగా పెట్టి పైకి పాకించాలి. చాలామంది హ్యాంగింగ్ పాట్స్ లో పెంచి, మొక్క కిందకు వేలాడేలా చేస్తారు. అయితే, కిందకు వేలాడే విధంగా పెంచడం వల్ల ఆర్థిక నష్టాలు, దురదృష్టం కలుగుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.. పైకి ఎదిగే మనీ ప్లాంట్ డబ్బును, అవకాశాలను ఆకర్షిస్తుందని, కిందకు వాలినది డబ్బును పడిపోయేలా చేస్తుందని వివరిస్తున్నారు.

మనీ ప్లాంట్ ఒక పరాన్నభుక్తం. అంటే ఇది ఇతర మొక్కల నుండి లేదా పరిసరాల నుండి శక్తిని గ్రహించి పెరుగుతుంది. దీనివల్ల అది పెరిగే ప్రదేశంలోని శక్తిని, అది సానుకూలమైనా లేదా ప్రతికూలమైనా, గ్రహించి మరింత బలంగా మారుతుంది. సరైన దిక్కులలో పెంచడం ద్వారా ఇది సానుకూల శక్తిని, సంపదను ఆకర్షించి మనకు మేలు చేస్తుంది. ఒకవేళ బలమైన చెట్టుకు పాకించాలనుకుంటే, ఆగ్నేయం లేదా వాయువ్యం దిశలలో ఉన్న బలమైన చెట్టుకు పాకించడం శ్రేయస్కరం.

తప్పుడు దిక్కులలో పెంచిన మనీ ప్లాంట్ తీవ్రమైన ఆర్థిక సమస్యలను, కుటుంబంలో కలహాలను సృష్టిస్తుందని స్పష్టం చేశారు నిపుణులు. కాబట్టి, మనీ ప్లాంట్ ను పెంచేటప్పుడు పైన చెప్పిన వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ నియమాలను పాటించడం వల్ల ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆర్థిక వనరులు ఏర్పడటం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నియమాలు పాటించలేని పక్షంలో, మనీ ప్లాంట్ ను పెంచకుండా ఉండటమే మంచిదంటున్నారు వాస్తుశాస్త్రం నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>