యాదగిరిగుట్టలో ఘనంగా లక్షపుష్పార్చన

కలం, యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో (Yadagirigutta Temple) భక్తుల సందడి నెలకొంది. శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారికి లక్ష పుష్పార్చనతో ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగియి. స్వామి వారి ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో వజ్రవైడుర్యాలతో అలంకరించి ప్రతీనిత్యం సువర్ణ పుష్పార్చన వేదికపై వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.

స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల సుఘంద పరిమళ పుష్పాలతో లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు. పాంచరాత్రాగమన శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించారు ప్రతి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ వేడుకలను తనివినిండా చూసి దర్శించి తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణధికారి భవాని శంకర్, ఆలయ వేదపండితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>