GHMC కీలక నిర్ణయం.. పార్కుల ఎంట్రీ ఫీజు పెంపు!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన పార్కుల్లో ప్రవేశ రుసుము (GHMC Park Entry Fees) పెరిగింది. పార్కుల్లోకి ప్రవేశించేందుకు పెద్దలు, పిల్లలు చెల్లించే టికెట్ ధరలను పెంచుతూ GHMC నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు GHMC స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశ రుసుము పెంపు ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు పేర్కొంది.

ప్రస్తుతం పెద్దలకు రూ.10గా ఉన్న ప్రవేశ రుసుమును రూ.20కి పెంచింది. అదేవిధంగా పిల్లలకు రూ.2గా నుంచి రూ.5కు పెంచింది. 12 ఏళ్లు పైబడినవారు రూ.20, 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు రూ.5 చెల్లించి పార్కుల్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. కాగా, పార్కుల సందర్శన కోసం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>