అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తాం: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ (KCR) నాయకత్వంలో పోరాటం చేస్తామని.. కేసీఆర్ స్వయంగా నాయకత్వం వహిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఫిర్జాదీగూడలో బుధవారం పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు కట్టామని.. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క ఉప్పల్ ఫ్లైఓవర్ కట్టలేకపోతుందని మండిపడ్డారు. లోక్ సభ, శాసనసభ సీట్లు పెంపు పై కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒక్కటి.. చేసేది ఒక్కటి అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హాయాంలో స్థానికంగా ఉన్న మార్కెట్ కమిటీలలో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని తెలిపారు. తాము కూడా శాసనసభలో తీర్మానం చేశామని చెప్పారు.

ఈసారి బీఆర్ఎస్‌కు ఓటు వేయండి..

మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మూడుకు మూడు సీట్లు క్లిన్ స్వీప్ చేశారని కేటీఆర్ కొనియాడారు. మళ్ళీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ సెప్టెంబర్ లోనో అక్టోబరులో ఎన్నికలు అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళను గెలిపిస్తే ఇక్కడకు మళ్ళీ బుల్డోజర్ వస్తుందని.. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కత్తి వాడికి ఇచ్చి పోరాటం మనము చేయలంటే ఎలా? అందుకే ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయండి అని కోరారు.

రెండేళ్లలో కేసీఆర్ రాబోతున్నాడు..

బీజేపీ తెలంగాణకు ఎన్నడూ మంచి చేయదని కేటీఆర్ దుయ్యబట్టారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ సీట్లు 50% పెంచుతామని కిషన్ రెడ్డి చెప్తున్నాడు కానీ బిల్లులో ఆ అంశమే లేదన్నారు. మహిళా రిజర్వేషన్ విషయంలో తాము మద్దతు ఇస్తామని.. ఆరోజు తాము అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి పంపింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టకపోగా.. వేలాది ఇండ్లను బుల్డోజర్లతో కూలగొట్టిందని ఫైర్ అయ్యారు. ఇది గరీబోళ్ల వ్యతిరేక ప్రభుత్వమని.. బుల్డోజర్ ప్రభుత్వం అని మండిపడ్డారు. రెండేళ్లలో కేసీఆర్ రాబోతున్నాడని, పేదలకు ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకునే బాధ్యత తమది అని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>