ఎండుతున్న వరి చేలు.. అప్పుల భారంతో అన్నదాతల ఆవేదన

కలం, జోగులాంబ గద్వాల : ​చెమటోడ్చి, రూ. లక్షల్లో అప్పులు చేసి నాటిన పంట కళ్లముందే ఎండిపోతుంటే అన్నదాతల బాధలు వర్ణతీతం. కేటిదొడ్డి మండలం కొండాపురం (Kondapuram) గ్రామంలో రైతులు ర్యాలంపాడు రిజర్వాయర్ 104 ప్యాకేజీ కాలువ ద్వారా సాగునీరందుతుందని ఆశసభావంతో వందల ఎకరాలలో వరి సాగు చేశారు.

ఎల్‌నినో ప్రభావంతో వానలు ముఖం చాటేయడం, భానుడి ప్రతాపానికి బోర్లలో నీళ్లు ఆవిరైపోవడంతో సకాలంలో సాగునీరు అందక పచ్చని వరి చేను ఎండుటాకులా మారిపోతున్నాయి. రైతులు సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి పడనిపాట్లు లేవు. ఒకవైపు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడం, మరోవైపు ర్యాలంపాడు 104 ప్యాకేజి (D-9) కాలువ నీరు వారబందీ విధానంతో అరకొరగానే అందడం, దానికితోడు విద్యుత్ కోతలు కోలుకోలేని దెబ్బతీశాయి.

లక్షలు పెట్టుబడి పెట్టి, రెక్కలముక్కలు చేసుకున్నా.. చివరికి ఆ పచ్చని పైరు పశువుల కడుపు నింపడానికే పనికొచ్చే పరిస్థితి రావడం రైతుల కుటుంబంలో అశనిపాతమైంది. ​”కష్టపడి నాటిన పంట చేతికి రాకుండా పోయింది. పెట్టిన పెట్టుబడి మట్టిపాలైంది. అప్పులు తీర్చే దారి లేక, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నాం” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>