Mobile Popup Ad
Mobile Popup Ad

హరీశ్ రావుకు విమర్శించే హక్కు లేదు: సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: కుంభకోణాల గురించి హరీష్ రావు మాట్లాడటం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) విమర్శించారు. కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌజ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులను విమర్శించే హక్కు లేదన్నారు. గత పదేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు కనీసం మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదన్నారు. అలాంటి ప్రభుత్వం నడిపినవారు మంత్రులు పొన్నం ప్రభాకర్,అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ శాఖల్లో టెండర్ల స్కాం జరిగిందని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పేద విద్యార్థుల బాధలు తెలిసిన వారు కాబట్టే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెస్, కాస్మోటిక్ ఛార్జీలను 40 శాతం పెంచిందన్నారు. నిజాయితీకి నిలువుటద్దంగా ఉన్న మంత్రి శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ సమావేశంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, ఆకారపు భాస్కర్ రెడ్డి, మడుపు మోహన్, అంజనీ ప్రసాద్, వరాల నర్సింగం, కాంరెడ్డి రాంరెడ్డి, దండి రవీందర్, నెల్లి నరేష్, షెహన్షా, ఎల్లారెడ్డి, హనీఫ్,ఖలీల్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>