సొంత అధికారులనే సీఎం నమ్మడం లేదు: కిషన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) విషయంలో అనేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో అక్రమాలు జరిగే అవకాశం ఉందంటున్నారని.. అసలు సర్ ప్రక్రియ నిర్వహిస్తున్నదే రాష్ట్ర అధికారులు కదా.. అని అన్నారు. అంటే, సొంత అధికారులపైనే ముఖ్యమంత్రికి నమ్మకం లేకుండా పోయిందన్నారు. మజ్లిస్ పార్టీతో కుమ్మక్కై ఒకవేళ ఓటర్ లిస్టులో నుంచి పేర్లు తొలగిస్తే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాలని పిలుపునిస్తున్నారని మండిపడ్డారు. అంతేగాకుండా, తన అధికారులనే ఇళ్లల్లోకి రానివ్వద్దని కూడా చెబుతున్నారని విమర్శించారు. సర్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>