తల్వార్‌లతో విన్యాసాలు.. ఇద్దరిపై కేసు నమోదు

కలం, ఖమ్మం బ్యూరో: పుట్టినరోజు వేడుకల పేరుతో తల్వార్లతో విన్యాసాలు చేస్తూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరు యువకులపై కొణిజర్ల పోలీసులు (Konijerla Police) కేసు నమోదు చేశారు. పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ కింద శుక్రవారం కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. కొణిజర్ల ఎస్సై సూరజ్ అందించిన వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన బుడేడ ఈశ్వర్, బుడేడ నర్సింహారావు పుట్టినరోజు వేడుకల సందర్భంగా తల్వార్లతో విన్యాసాలు చేసి, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఆ వీడియోలను ప్రచారం చేశారు.

​ఈ సందర్భంగా ఎస్సై సూరజ్ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో తల్వార్ల వంటి పదునైన ఆయుధాలతో విన్యాసాలు చేస్తూ ఇతరులను భయభ్రాంతులకు గురిచేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దారితీస్తాయని తెలిపారు. ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను పోలీసుశాఖ తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. యువత ఇలాంటి ప్రమాదకరమైన చర్యలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>