96 ఏళ్ల బామ్మ కల.. ఎంపీ రవిచంద్ర చొరవ.. బాధ్యత తీసుకున్న కేటీఆర్

​కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ సమాజం గర్వించదగ్గ మహానేత కేసీఆర్‌ను ప్రత్యక్షంగా చూడాలనే 96 ఏళ్ల వృద్ధురాలి చిరకాల కోరిక నెరవేరే తరుణం ఆసన్నమైంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన 96 సంవత్సరాల దుగ్గిదేవర సామ్రాజ్యం (Duggidevara Samrajyam) అనే బామ్మ కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేక చొరవ చూపారు. బామ్మ కోరికను తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆ బాధ్యతను భుజానకెత్తుకున్నారు.

​గ్రామ సర్పంచ్‌గా రెండుసార్లు, ఎంపీటీసీగా రెండు పర్యాయాలు, సింగిల్ విండో డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం సేవలందించిన దుగ్గిదేవర సామ్రాజ్యం అన్ని వర్గాల ప్రజల మన్ననలు, గౌరవాభిమానాలను పొందారు. అహింసా మార్గంలో ఉద్యమాలను నడిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టి, రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంటే ఆమెకు ప్రాణంతో సమానమైన అభిమానం. కేసీఆర్‌ను ఒక్కసారైనా కలిసి ఆయనతో ఫోటో దిగాలన్నదే ఆమె జీవితాశయం.

​తల్లి సామ్రాజ్యం చిరకాల కోరికను ఆమె పెద్ద కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు వెంకటలాల్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే సానుకూలంగా స్పందించిన ఎంపీ రవిచంద్ర.. శుక్రవారం రోజున బామ్మ సామ్రాజ్యంను, ఆమె కుమారులు వెంకటలాల్, అజయ్ కుమార్, మనవళ్లు యుధిష్టర్, శ్రీరఘునందన్‌లను వెంటబెట్టుకుని హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మను ఎంతో ఆప్యాయంగా పలకరించి, శాలువాతో సత్కరించి ఘనంగా గౌరవించారు. త్వరలోనే ఆమెను నేరుగా కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి చిరకాల కోరికను నెరవేరుస్తానని కేటీఆర్ స్వయంగా మాటిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>