పగిలిన దేవాదుల పైప్‌లైన్.. నీరు వృథా

కలం, హనుమకొండ: హసన్‌పర్తి మండలం దేవన్నపేట వద్ద దేవాదుల పైప్‌లైన్ (Devadula Pipeline) పగిలి నీరు వృథాగా పోతోంది. గాల్లోకి ఫౌంటెయిన్ లాగా నీరు ఎగిసిపడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే నీటిని నిలిపేసి.. పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టారు. అసలే వర్షాలు లేక నీటి ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో.. అధికారులు లీకేజీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>