భారీ యంత్రాలు దించినా.. అంగుళం కదలని ఆంజనేయుడు

కలం, నేషనల్ డెస్క్: ఆధ్యాత్మిక నగరం ఉజ్జయిని (Ujjain) లో భక్తులను ఆశ్చర్యపరిచే ఘటన ఒకటి చోటుచేసుకుంది. సింహస్థా కుంభమేళా-2028 సన్నాహాల్లో భాగంగా నగరంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కంఠాల్‌ నుంచి ఛత్రీ చౌక్‌ వెళ్లే మార్గంలో ఉన్న సుమారు 170 ఏళ్ల నాటి ‘ఖడే హనుమాన్‌’ (Khade Hanuman) విగ్రహాన్ని మరో చోటుకు తరలించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అయితే, గత రెండు రోజులుగా ఇంజినీర్లు, ఆధునిక యంత్రాలతో ఎన్ని ప్రయత్నాలు చేసినా విగ్రహం అంగుళం కూడా కదలలేదు.

పరిస్థితి సున్నితంగా మారడంతో అధికారులు ప్రస్తుతానికి తరలింపు ప్రయత్నాలను నిలిపివేశారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు పురావస్తు నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. అత్యాధునిక స్కానర్లతో విగ్రహం పునాది, అంతర్గత నిర్మాణం, చుట్టుపక్కల మట్టిని పరిశీలించనున్నారు. స్కానింగ్‌ నివేదిక ఆధారంగా విగ్రహాన్ని తరలించేందుకు ఏ సాంకేతికతను ఉపయోగించాలన్నది నిర్ణయిస్తామని తహశీల్దార్‌ షెఫాలీ జైన్‌ తెలిపారు.

దైవ సంకల్పమేనంటున్న భక్తులు

విగ్రహం కదలకపోవడాన్ని భక్తులు దైవ సంకల్పంగా భావిస్తున్నారు. తరలింపు ప్రయత్నాలపై హిందూ సంస్థలు, స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో భారీగా మహా హారతి నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా రాకపోకలకు మార్గం ఉన్నప్పుడు ఆలయాన్ని ఎందుకు తొలగించాలని ఆలయ పూజారి సులభ్‌ శంతను శర్మ ప్రశ్నించారు. విగ్రహానికి (Khade Hanuman) ఎలాంటి నష్టం జరగకుండా ట్యాంకీ చౌక్‌లో ప్రతిష్టిస్తామని రాతపూర్వక హామీ ఇస్తేనే తరలింపునకు అంగీకరిస్తామని స్పష్టం చేశారు.

Also Read : మెట్రో సిటీలకు సూరత్ ‘డైమండ్’ పంచ్.. ఖర్చుల్లో @నెం.1!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>