పట్టుదల.. అంకితభావం.. కఠోర శ్రమే విజయానికి సోపానాలు: కొలగాని శ్రీనివాస్

కలం, కరీంనగర్: పట్టుదల, అంకితభావం, కఠోర శ్రమతో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ-పీజీ కళాశాలలో  “నా దేశం-నా జాతి-నా బాధ్యత” అనే అంశంపై వ్యక్తిత్వ నిర్మాణ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. నేషనల్ యూత్ ప్రాజెక్ట్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. 1893 సెప్టెంబర్ 11న అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద చేసిన చారిత్రాత్మక ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఔన్నత్యాన్ని చాటిందన్నారు. స్వామి వివేకానంద చూపిన మార్గం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థులు స్వామి వివేకానంద బోధనలు, ఆధ్యాత్మిక సందేశాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం, కఠోర శ్రమతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నతమైన విలువలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి వివిధ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు సమాజం, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మేయర్ ఆకాంక్షించారు. జిల్లా యువజన అధికారి *జి. తిరుపతిరెడ్డి* మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యతో పాటు వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని, సన్మార్గంలో నడుస్తూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్. శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, దేశభక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏసీఓ బి. సంపత్ కుమార్, ఏవో బి. శ్రావణ్ కుమార్, కామర్స్ విభాగాధిపతి డాక్టర్ ఆర్. గోపికృష్ణ, నేషనల్ యూత్ ప్రాజెక్ట్ బాధ్యులు కె. యాదవరాజు, ఎం.డి. తాహర్ పాషా, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>