Mobile Popup Ad
Mobile Popup Ad

ఫ్రాన్సిస్ న్గాన్నోతో ఫైట్‌కు జాన్ జోన్స్ రెడీ.. కానీ ట్విస్ట్!

కలం, వెబ్‌ డెస్క్ : ఫ్రాన్సిస్ న్గాన్నో (Francis Ngannou) విసిరిన సవాల్‌కు తాను రెడీ అని ప్రకటించాడు ప్రముఖ ఫైటర్ జాన్ జోన్స్ (Jon Jones). కానీ ఈ విషయంలో తనకు యూఎఫ్‌సీ కాంట్రాక్ట్ మాత్రమే అడ్డుపడుతోందని వివరించాడు. ప్రస్తుతం ఎంఎంఏ ప్రపంచంలో ఈ ఇద్దరు దిగ్గజాల ఫైట్ గురించిన చర్చ జోరందుకుంది. ఇటీవల జరిగిన ఒక మ్యాచ్‌లో ఫిలిప్ లిన్స్‌ను మొదటి రౌండ్‌లోనే నాకౌట్ చేసిన తర్వాత ‘ది ప్రిడేటర్’ న్గాన్నో నేరుగా జాన్ జోన్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. జోన్స్ గొప్ప ఫైటర్ అనడంలో సందేహం లేదని, కానీ బిజినెస్ విషయాల్లో ఆయన ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు. తామిద్దరం రిటైర్ కావడానికి ముందే ఈ బిగ్ ఫైట్ జరగాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే జోన్స్ ప్రస్తుతం యూఎఫ్‌సీ కాంట్రాక్ట్ అనే పంజరంలో చిక్కుకున్నారని న్గాన్నో వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో జాన్ జోన్స్ వెంటనే స్పందించారు. తాను ఇప్పటికీ యూఎఫ్‌సీ కాంట్రాక్ట్‌కు కట్టుబడి ఉన్నానని, దాని నుండి బయటపడే మార్గాలను చురుగ్గా వెతుకుతున్నానని స్పష్టం చేశారు. అయితే న్గాన్నో తాజా విజయంపై జోన్స్ అంతగా ఇంప్రెస్ కాలేదు. న్గాన్నో కంటే చాలా తక్కువ బరువు ఉన్న ప్రత్యర్థితో తలపడటం వల్లే ఆ విజయం సులువుగా దక్కిందని జోన్స్ విశ్లేషించారు. ప్రత్యర్థి భయపడటం వల్లే న్గాన్నోకు మ్యాచ్ అనుకూలంగా మారిందని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, మాజీ యూఎఫ్‌సీ స్టార్, ప్రస్తుత విశ్లేషకుడు చేల్ సోనెన్ ఈ ఇద్దరి వాదనలను పూర్తిగా కొట్టిపారేశారు. వీరిద్దరూ తలపడటానికి ఎలాంటి కాంట్రాక్టులు అడ్డుగా లేవని ఆయన బాంబు పేల్చారు. అసలు నిజం ఏంటంటే, ఒకరితో ఒకరు తలపడటం ఇద్దరికీ ఇష్టం లేదని సోనెన్ వ్యాఖ్యానించారు. కేవలం ప్రేక్షకుల నుండి గౌరవం పొందడానికే ఇద్దరూ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఒక యూట్యూబ్ సెగ్మెంట్‌లో చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>