ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

కలం, బైంసా: బైంసా మండలం చుచుంద్ గ్రామ (Chuchund Village) ప్రాథమిక పాఠశాలలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.రాజేశ్వర్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఝాన్సీ లక్ష్మీబాయికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. చిన్న వయసులోనే ధైర్యసాహసాలు ప్రదర్శించి బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ఆమె పోరాట స్ఫూర్తి నేటి యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు ఆదర్శమని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పండరి, జ్యోత్స్న, పద్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>