బిగ్ రిలీఫ్.. హర్మూజ్‌పై ఇరాన్ సంచలన ప్రకటన

కలం, వెబ్ డెస్క్: హర్మూజ్ జలసంధి(Strait of Hormuz)పై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేశామని ప్రకటించింది. దీంతో ప్రపంచదేశాలన్నీ ఊపిరిపీల్చుకున్నాయి. హర్మూజ్ జలసంధి మీద ఆంక్షలు విధించడంతో ఆ ప్రభావం అనేక దేశాల మీద పడింది. వ్యాపారసంస్థలు క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపించింది. స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. సామాన్యుల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు అంతా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు ఇరాన్ దిగివచ్చింది. చమురు నౌకలను ఇకపైన అడ్డుకోబోమని ఇరాన్ తెలిపింది. దీంతో ఇకపై నౌకల రాకపోకలకు అన్ని విధాలుగా అడ్డు తొలిగినట్టే.

పడిపోయిన ముడిచమురు ధరలు

ఇరాన్ ప్రకటనతోనే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు బ్యారెల్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి ముందు 80 డాలర్లక కంటే తక్కువ ధర ఉండేది. కాగా ఇటీవల కాలంలో గరిష్టంగా 120 డాలర్లకు చేరుకున్నది. ఇరాన్ ప్రకటనతో క్రూడాయిల్ ధరలు కంట్రోల్ అయ్యాయి. అన్ని దేశాల్లో ఎల్పీజీ, పీఎన్జీ, పెట్రోల్, డీజిల్ సమస్యలు తగ్గుముఖం పట్టనున్నాయి. మార్చి 28 నుంచి హర్మూజ్ జలసంధి మీద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రకటనతో అన్ని దేశాలకూ ఉపశమనం లభించినట్టైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>