వెన్నెల‌గ‌డ్డ చెరువు క‌బ్జా.. రంగంలోకి హైడ్రా

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్‌లో మ‌రో చెరువును హైడ్రా (HYDRAA) అధికారులు ర‌క్షించారు. కొన్నేళ్ల నుంచి క‌బ్జాల‌కు గుర‌వుతున్న చెరువులో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి హెచ్చ‌రిక‌ల బోర్డులు ఏర్పాటు చేశారు. మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండ‌లం జీడిమెట్ల గ్రామంలో వెన్నెల‌గ‌డ్డ చెరువు ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతోంద‌ని స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. కొంత‌మంది చెరువులో మ‌ట్టిపోసి నిర్మాణాలు చేప‌ట్టార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదుపై హైడ్రా అధికారులు వెంట‌నే స్పందించారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి చెరువును ప‌రిశీలించారు. సుమారు 4 ఎక‌రాల వ‌ర‌కు క‌బ్జాకు గురైన‌ట్లు గుర్తించారు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ప్రీకాస్ట్ వాల్స్ నిర్మించి ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డ్డ‌ట్లు తెలిపారు. ఆ గోడ‌ల‌ను, అక్ర‌మ నిర్మాణాల‌ను నేడు తొల‌గించారు. చెరువును ఆక్ర‌మించే అవ‌కాశం ఉన్న హ‌ద్దుల్లో హైడ్రా అధికారులు కంచె ఏర్పాటు చేశారు. సుమారు 1 కిలో మీట‌రు వ‌ర‌కు కంచె నిర్మించి, స‌రిహ‌ద్దు ఏర్పాటు చేసి హెచ్చ‌రిక బోర్డులు ఏర్పాటు చేశారు. హైడ్రా అధికారులు వేగంగా స్పందించి చెరువును ర‌క్షించినందుకు స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>