ఆసియా కప్‌కు ఇండియా రెడీ.. కెప్టెన్‌గా భావికా అహిరే

క‌లం, స్పోర్ట్స్: అండర్-19 మహిళల ఆసియా కప్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. వికెట్ కీపర్, బ్యాటర్ భావికా అహిరే (Bhavika Ahire) కెప్టెన్‌గా, అనాది తగ్డే వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. 2027 అండర్-19 టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా భారత్ ఈ టోర్నీ బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. నవంబర్ 28న వడోదరలో జరిగిన రెండో టీ20లో భారత్ 106 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత భారత్ 230/6 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 124 పరుగులకే కుప్పకూలింది.

ఈ సిరీస్‌లో భారత యువతరం చెలరేగి ఆడుతోంది. అక్సా పర్మార్ తొలి మ్యాచ్‌లో 52, రెండో మ్యాచ్‌లో 81 పరుగులు చేసింది. ఓపెనర్ దియా యాదవ్ రెండో టీ20లో 49 బంతుల్లోనే 87 పరుగులు (12 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదింది. బౌలింగ్‌లో 15 ఏళ్ల ఉమా కాశ్వి రెండు మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టింది. ఇటీవల నేపాల్‌తో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో ఆడిన 10 మంది క్రీడాకారిణులకు ఈ జట్టులో చోటు దక్కింది. 2024లో నికీ ప్రసాద్ సారథ్యంలో తొలి ఆసియా కప్ గెలిచిన భారత జట్టులో భావిక, ఈశ్వరి అవచారే సభ్యులుగా ఉన్నారు. వీరి అనుభవంతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరోసారి టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తోంది.

భారత జట్టు:
భావికా అహిరే (కెప్టెన్, వికెట్ కీపర్), అనాది తగ్డే (వైస్ కెప్టెన్), ఇరా జాదవ్, నిధి మహతో, పూర్వా సివాచ్, మహక్ నర్వాసే, మైత్రి మనియార్, ఈశ్వరి అవచారే, దియా యాదవ్, శ్రేయా ఎస్ చవాన్ (వికెట్ కీపర్), సమైరా రాఘవ్, కుమారి పాలక్, ఉమా కాశ్వి, అక్సా పర్మార్, పాలక్ సింగ్.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>