శ్రీశైలానికి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో కర్ణాటక జలాశయాల నుంచి భారీగా వరద నీరు జూరాల జలాశయానికి (Jurala Project) వచ్చి చేరుతుండటంతో జూరాల వద్ద కృష్ణమ్మ జల‌సందడి చేస్తొంది. బుధవారం సాయంత్రం కర్ణాటక లోని ఆల్మట్టికి ఇన్‌ఫ్లో 68,525 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 80,000 క్యూసెక్కులుగా నమోదైంది.

ఆల్మట్టి సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 118.221 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 62,171 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ఫ్లో 89,520 క్యూసెక్కులు నమోదైంది. నారాయణపూర్‌ సామర్థ్యం 33.313 టీఎంసీలకుగానూ 31.41 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కర్ణాటక జలాశయాల దిగువకు 89,520 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్న జూరాల ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రానికి జూరాలకు 32,500 ఇన్ ప్లో‌ నమోదు‌కాగ , అవుట్ ప్లో 41,520 క్యూసెక్కులు నమోదైంది.

అలాగే ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 317.06 మీటర్లకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి సామర్థ్యం 6.841 టీఎంసీలుగా నమోదు అయ్యింది. వరద ప్రవాహం నేపథ్యంలో మరోవైపు జూరాల మీద ఆదారపడిన ఉన్న ఎత్తిపోతల పథకాల్లో లిఫ్ట్‌లను ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తికి 35,913, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1500 క్యూసెక్కులు, భీమా-1కు 1300 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతలకు 630 క్యూసెక్కులు, కుడి కాలువకు 500, ఎడమ కాలువకు 1030, సమాంతర కాలువకు 600 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>