పట్టాలు తప్పిన రైలు.. నిలిచిన రాకపోకలు!

కలం, వెబ్ డెస్క్: కొవ్వూరు రైల్వే స్టేషన్ (Kovvur Railway Station) వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో పదుల సంఖ్యలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే సౌత్ కోస్టల్ రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గూడ్స్ రైలును తిరిగి పట్టాలపైకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలియడంతో నార్త్ సింహాచలం, విశాఖపట్నం, దువ్వాడ, అనకాఆపల్లి రైల్వే స్టేషన్లలోని అన్ని ప్లాట్ ఫారాలు పూర్తిగా నిండిపోయాయి. ఉదయం నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>