గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కలం, వెబ్ డెస్క్: శ్రావణ మాసం వేళ బంగారం, వెండి (Gold Silver Prices) కొనుగోళ్లు చేద్దామనే వారికి గుడ్ న్యూస్ అందుతోంది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కొద్ది రోజులుగా ఆకాశాన్నింటిన ధరలు ఒక్కసారిగా తగ్గడంతో శ్రావణ మాస ముహూర్తాల వేళ వాటిని కోనుగోలు చేసే వారికి భారీ ఊరట దక్కింది.

ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల, 10 గ్రాముల బంగారం ధర రూ. 710కి తగ్గి రూ.1,52,890 కి చేరుకుంది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,40,150గా నమోదైంది. మరోవైపు కేజీ వెండి ధరపై ఏకంగా రూ.5000 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 2. 55 లక్షలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దాదాపు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>