శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కలం, వెబ్ డెస్క్: పండగ సమయంలో పుత్తడి ప్రియులకు గుడ్‌న్యూస్ అందుతోంది. గత రెండేళ్లలో ఊహకందని విధంగా పెరుగుతూ పోయిన బంగారం వెండి ధరలు (Gold – Silver Prices).. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోంది. ఆకాశాన్నంటేలా పెరిగిన బంగారం ధరలతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు చేసే ఆడపిల్లల తల్లిదండ్రులు బంగారం పెరుగుతుండటంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. పశ్చిమాసియా దేశాల మధ్య ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్ల ప్రభావంతో భారీగా బంగారం, వెండి ధరలు రూ. 2 లక్షల మార్కును చేరుకొని అందర్నీ షాక్‌కు గురి చేశాయి. తాజాగా గత కొద్ది నెలలుగా ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సామాన్యులకు ఊరటనిచ్చాయి.

తాజాగా అక్టోబర్ 22న బంగారం, వెండి ధరలు (Gold – Silver Prices) భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,700 తగ్గి ప్రస్తుతం రూ.1,44,380గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,550 తగ్గి రూ.1,32,350కు చేరింది. ఇక వెండి ధర విషయానికొస్తే.. కేజీ వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,25,000 గా కొనసాగుతోంది. గత కొన్ని నెలల క్రితం కిలో వెండి ధర రూ.2,50,000కు చేరుకోగా.. తాజాగా రూ.2,25,000కు పడిపోయి కొనుగోలుదారులకు  వెండి ధరలు ఊరటనిచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పట్టణాల్లో దాదాపు ఇవే ధరలు అమలులో ఉన్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ రేటు పుంజుకోవడం, ముడి చమురు ధరలు అధికంగా పెరగడం వంటి కారణాల వల్ల బంగారం ధరలు పతనం అవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : తెలంగాణ‌లో మోదీ, అమిత్ షా పర్య‌ట‌న‌లు ఖ‌రారు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>