బురఖాతో నామినేషన్.. వైసీపీ అభ్యర్థి బిగ్​ ప్లాన్​!

క‌లం, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్య నామినేషన్​ తొలి రోజు నుంచే తీవ్ర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇరు పార్టీల నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ క్ర‌మంలో త‌మ అభ్య‌ర్థుల‌ను నామినేష‌న్లు వేయ‌నివ్వ‌డం లేద‌ని, నామినేష‌న్ ప‌త్రాలు చించివేస్తున్నార‌ని వైసీపీ ఆరోపించింది. దీనిపై స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నుంచి సుప్రీం కోర్టు వ‌ర‌కు ఫిర్యాదులు చేరుకున్నాయి.

తాజాగా అనంత‌పురం జిల్లాలో ఓ వైసీపీ అభ్య‌ర్థి వినూత్న రీతిలో నామినేష‌న్ కేంద్రానికి వ‌చ్చారు. టీడీపీ నాయ‌కులు త‌మను నామినేష‌న్ వేయ‌కుండా అడ్డుకుంటున్నార‌ని, నామినేష‌న్ ప‌త్రాలు చించివేస్తున్నార‌ని బుర‌ఖాతో పెద్ద ప్లానింగ్ చేశారు. గుంతకల్లు వైసీపీ ఇంచార్జి నైరుతి రెడ్డి (Nairuthi Reddy) బుర‌ఖా వేసుకొని, బుర‌ఖా లోప‌ల నామినేష‌న్ ప‌త్రాల‌ను న‌డుముకు చుట్టుకొని కేంద్రానికి వ‌చ్చారు. ఇప్పుడు ఎవరు నామినేష‌న్ పేప‌ర్స్‌ లాక్కుంటారో, ఎవరు వ‌చ్చి చించుతారో రండి అంటూ టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. ఆమె వెంట వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. కొద్దిసేపు వీరు రోడ్డుపైన కూడా బైఠాయించారు. అయితే నైరుతి రెడ్డి నామినేష‌న్ వేశారా? లేదా? అనే దానిపై స‌స్పెన్స్ నెల‌కొంది.

Also Read : ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేద్దాం: జగన్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>