కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లోని ఫోర్ఫాదర్స్ పబ్‌కు (Forefathers Pub) అధికారులు రూ.20 వేల జరిమానా విధించారు. నీటిని వృథా చేయడంతో పాటు తాగునీటిని సైతం దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు రంగంలోకి దిగింది. వెంటనే తనిఖీలు చేపట్టింది. జరిమానాతో పాటు నీటి కనెక్షన్ కూడా నిలిపేసింది. అంతేగాకుండా ఇక నుంచి పబ్‌కు ట్యాంకర్ల సరఫరాను కూడా ఆపేస్తున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు.
వాటర్ బోర్డు అప్రమత్తం..
తాగునీటి కొరత నేపథ్యంలో వాటర్ బోర్డు అప్రమత్తమైంది. నీటిని పొదుపుగా వినియోగించాలని అవగాహన కల్పించడంతో పాటు వృథా చేసినవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, ఇతర వాణిజ్య సంస్థలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. జరిమానాలు విధించడంతో పాటు నల్లా కనెక్షన్లు కూడా తొలగిస్తామని సూచించింది. ఎక్కడైనా నీరు వృథా చేస్తున్నట్లు కనిపిస్తే 99499 30003 అనే వాట్సాప్ నెంబరుకి ఫిర్యాదు చేయొచ్చని అధికారులు కోరారు.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘స్పిరిట్’ కొత్త పోస్టర్!
Follow Us On : WhatsApp

